Mohammed Shami: మళ్ళీ మెరిసిన మహ్మద్ షమీ ..! 10 h ago
అంతర్జాతీయ క్రికెట్‌కు 14 నెలలు దూరంగా ఉన్న ఆటగాడు జట్టులో స్థానం సంపాదించడం చాలా కష్టం. షమీ అలాకాదు తన ప్రతిభను నిరూపిస్తూ, చాంపియన్స్ ట్రోఫీ పోటీలో నిలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఫిట్‌నెస్‌ను అందుకొని ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమంటూ ప్రదర్శనతోనే బీసీసీఐ సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. అతడి ఫిట్‌నెస్ ఎలా ఉంటుందోననే ఆందోళన ఉంది. కానీ, విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో షమీ మెరిశాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగి హరియాణాతో మ్యాచ్ లో రాణించాడు.